Sunday, May 19, 2024

9మంది భారత జవాన్లు మృతి

లోయలో పడ్డ వాహనం
లడఖ్‌లోని లేహ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 10మంది భారత జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొకరు తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం కేరే గ్యారిసన్‌ నుంచి లేహ్‌ సమీపంలోని ఖేర్‌కి వెళ్తుండగా జరిగినట్లు తెలుస్తోంది. ఖేర్‌కి 7కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img