Tuesday, May 28, 2024

కిషన్ రెడ్డికి లండన్‌లో సంప్రదాయ స్వాగతం

– అట్టహాసంగా ‘మీట్ అండ్ గ్రీట్’ నిర్వహించిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం
– ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

లండన్: న్యూయార్క్ పర్యటన ముగించుకుని సోమవారం లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ – యూకే విభాగం ఆధ్వర్యంలో విమానాశ్రయంలో సంప్రదాయ పద్ధతిలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. డోలు వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ, హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలనతో కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్లలో నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలతో పాటు భారతీయ సమాజంలో వచ్చిన మార్పులను వివరించారు.

విదేశాల్లో ఉంటున్న భారతీయుల ఆకాంక్షలను పూర్తిచేయడం, విదేశాల్లో వారికి సరైన గౌరవం లభించేలా మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం పలువురు యువతీ యువకులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ‘సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్స్‌లెన్స్’ విద్యార్థులైన యువత చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం అధ్యక్షుడు శ్రీ కుల్‌దీప్ షెకావత్, ప్రధానకార్యదర్శి శ్రీ సురేశ్ మంగళగిరి, బీజేపీ యూకే సభ్యులు, భారత సంతతికి చెందిన పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img