Friday, May 24, 2024

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి

– జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్డండ వెంకటేశ్‌
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్డండ వెంకటేశ్‌ ఆదేశించారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఇంద్ర నగర్, జవహర్ నగర్‌ల లో చేపట్టిన నూతన సీసీ రోడ్డు, మంచి నీరు, సివరేజ్ పనులను జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ విజయ్ కుమార్‌తో పాటు వాటర్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ రాంబాబు, సివరేజ్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ శ్రీహరితో కలిసి పరిశీలించిన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరం ఉన్న చోట నూతన సీసీ రోడ్డు పనులు, మంచినీరు, సివరేజ్ పైపులైన్లు పనులు చేయించడం జరుగుతుందని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ విజయ్ కుమార్, వాటర్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ రాంబాబు, సివరేజ్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ శ్రీహరి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img