Friday, May 24, 2024

మెగా ఫ్యామిలీ ఇంట సంబురాలు

– తల్లిదండ్రులైన ఉపాసన రాంచరణ్‌ దంపతులు
– ఆడబిడ్డకు జన్మనిచ్చిన మెగా కోడలు

టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. మెగా పవర్​ స్టార్​ రామ్‌ చరణ్‌ ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ బులెటిన్‌ విడుదల చేసింది. చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహం కాగా, వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకలను కూడా నిర్వహించారు.

సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని, తాము దీనికి పూర్తి భిన్నమని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను, చరణ్‌ అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని, బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామల (చిరంజీవి- సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని ఉపాసన స్పష్టం చేసింది. తమ ఎదుగుదలలో గ్రాండ్​ పేరెంట్స్ కీలకపాత్ర పోషించారని, వారితో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవాలని ఆమె చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img