రాజకీయం కంటే దేశమే ముఖ్యం

నవ భారత నిర్మాణం కోసం కలిసి పనిచేద్దాం
వచ్చే వంద రోజులు ఎంతో కీలకం
ప్రధాని నరేంద్ర మోడీ


రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయని.. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రధాని పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించామని, ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.

విపక్ష నేతలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని పేర్కొంటున్నారని చెప్పారు.

18ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని, దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు.

సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా ప్రతి ఇంటికి.. ప్రతి గడపకు వెళ్లి ఓటర్‌ను చేరుకోవాలని సూచించారు.

నవభారత్‌ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

గత పదేళ్లలో బీజేపీ హయాంలో దేశ రూపురేఖలే మారిపోయాయని, దేశానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని పునరుద్ఘటించారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీదే విజయమని స్పష్టం చేశారు.