Tuesday, May 28, 2024

BREAKING NEWS: అందుకే బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు

  • కేసీఆర్‌పై గుత్తా సంచలన వ్యాఖ్యలు

పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారని అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పార్లమెంట్ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే గుత్తా కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వారి నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే గుత్తా కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పార్టీ మారితే నల్లగొండలో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img