Friday, May 24, 2024

ఆయనకే మా మద్దతు..

పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిగా మద్దతు పెరుగుతోంది. తాజాగా తన కుటుంబం మొత్తం జనసేన పార్టీకి సపోర్టుగా ఉంటామంటూ ప్రకటించారు ప్రముఖ నటుడు శివబాలాజీ. సంక్రాంతి సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ బాలాజీ, మధుమిత దంపతులు మాట్లాడుతూ పవన్ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా పవర్‌స్టార్‌కి పెద్ద అభిమానిని. అయితే నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ నేను ముందు నుంచి పవన్‌ సార్‌కి సపోర్ట్‌గా ఉన్నాను.

ఆయన స్థాపించిన నాటి నుంచి జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నాం. రాజకీయాల్లోకి రాను కానీ ఆయన ఒక్క మాట చెప్తే చాలు. జనసేన పార్టీ కోసం మరింత క్రియాశీలకంగా పనిచేస్తాం. మా సోషల్‌ మీడియా ద్వారా పవన్‌ సార్ కోసం పని చేస్తాం. నూటికి నూరు శాతం ఆయన కోసం కష్టపడి పని చేస్తాం. పవన్‌ సార్‌కు ఓపిక ఎక్కువ. ఆయనకున్న క్రేజ్‌, పాపులారిటీతో లు చేసుకుంటూ కోట్లు వెనకేసుకోవచ్చు. కానీ ఆయన ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి కష్టపడుతున్నారు’ అని పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు శివ బాలాజీ.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img