Sunday, May 19, 2024

Sathyavathi rathod| కేసీఆర్‌ వెంటే ఉంటా

  • మారుతున్నానంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
  • మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌

‘నేను బీఆర్‌ఎస్‌ను వీడుతున్నానంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజంలేదు. ఈ చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను కేసీఆర్‌ వెంటే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల అసమర్థ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఎందుకు కేసీఆర్‌ను ఓడించామా అని బాధపడుతున్నారని అన్నారు.

రాజకీయం అన్నాక గెలుపోటములు సహజమని ప్రజల పక్షాన నిలిచి బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా ఉద్యమిస్తాని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img