Sunday, May 19, 2024

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ భవన్ లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు

తెలంగాణ ఉద్యమ సారథి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు శనివారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

శనివారం జరిగిన ఈ సంబరాల ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తీసుకున్నారు. ఈ వేడుకలకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జన్మదిన వేడుకల సందర్భంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ సహకారంతో వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు ఒకొక్కరికి రూ.లక్ష కవరేజీతో కూడిన ఇన్సూరెన్స్ పత్రాలు, 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్ లను కేటీఆర్‌ చేతులమీదుగా పంపిణీ చేశారు.

అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్ ను రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి కేటీఆర్‌ కట్ చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ జీవిత, రాజకీయ, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన ‘అతనే ఒక చరిత్ర’ డాక్యుమెంటరీ ని వీక్షించారు.

తెలంగాణ భవన్ ఆవరణలో తెలంగాణ ఉద్యమం, కేసీఆర్‌ ఆమరణ దీక్ష విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని మాజీ మంతరులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు అన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తూ మరణించిన 70 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒకొక్కరికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా ద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి,

మాజీ కార్పోరేషన్ చైర్మర్లు సోమ భరత్ కుమార్, అనిల్ కుమార్ కూర్మాచలం, వాసుదేవ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీష్ రెడ్డి, మసి ఉల్లా ఖాన్, పలువురు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img