Tuesday, May 28, 2024

బాక్సింగ్‌ క్రీడాకారుడికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందన

హైదరాబాద్ కు చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు దేవానందనం ఇటీవల నేపాల్ లో ఎస్‌బీకేఎఫ్‌ (సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ 79 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే దుబాయిలో ఈనెల 30 నుంచి ఆగస్టు 19 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ ‘దుబాయ్ – 2023’కు ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో శుక్రవారం దేవానందనంను అభినందించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ ఇండియన్ టీమ్‌ మాజీ కెప్టెన్ కే. వెంకటనారాయణ, తెలంగాణ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీ. లక్ష్మయ్య, హన్వాడ మాజీ ఎంపీపీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img