Sunday, May 19, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

ప్రజానావ/వేములవాడ రూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లి గ్రామ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సంకెపల్లి గ్రామానికి చెందిన నాగుల అంజయ్య తన ద్విచక్ర వాహనంపై వేములవాడ వైపు వస్తుండగా, ఎదురుగా వేములవాడ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారు గ్రామ పంచాయతీ సమీపంలో అంజయ్య వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామ రోడ్‌ సేఫ్టీ విలేజ్‌ కమిటీ సభ్యులు రగుడు పరుశరామ్‌, రెడ్డవేణి వినయ్‌ ఘటనా స్థలానికి వెళ్లి ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img