Tuesday, May 28, 2024

చిక్కాలపై పద్మశాలీల ఆగ్రహం

పద్మశాలి సామాజిక వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావుపై పద్మశాలి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మశాలి నాయకులు మాట్లాడుతూ పద్మశాలీలను అగౌరవచడం బిఆర్ఎస్ సీనియర్ నాయకులుగా ఉన్న చిక్కాల రామారావుకు తగదని హితవు పలికారు. స్వతహాగా సౌమ్యులైన పద్మశాలీలను పట్టుకొని మీ ఓట్లతోనే గెలిచామా అని చిక్కాల అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చిక్కల రామారావుకి ఏ కులాల వారు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో సిరిసిల్లలో వివిధ వర్గాల నాయకులు ఉన్నప్పటికీ అన్ని కులాలు ఐక్యమత్యంతో ఉండి, వేరే కులాలను కించపరిచిన దాఖలాలు లేవన్నారు. అనుచిత వ్యాఖ్యల సందర్భంలో ప్రత్యక్షంగా ఉన్న తమ పద్మశాలి నాయకుడు మండల సత్యం కొందరికి భయపడి బయటకు రావట్లేదని అన్నారు. పద్మశాలీలను ఎవరూ అగౌరవపరిచినా ఉపేక్షించకుండా, పార్టీలకతీతంగా ఎదుర్కొంటామని పద్మశాలి నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img