Sunday, May 19, 2024

Petrol on mro: ఎమ్మార్వోపై పెట్రోల్‌

భూ సమస్య తీర్చడం లేదంటూ మహిళల దుశ్చర్య

భూ సమస్యల తీర్చడం లేదని ఆగ్రహించిన మహిళలు ఎమ్మార్వోపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనలో నలుగురు మహిళలు పెట్రోల్‌ బాటిళ్లతో తహసీల్‌ ఆఫీసుకు వచ్చారని, తనపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారని తహసీల్దార్‌ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి హత్య తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి.

అప్పట్లో రెవెన్యూ శాఖ ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకుంది. రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీస్‌ భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించినా చాలాచోట్ల సీసీ కెమెరాలు, పోలీసులు కనిపించడం లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img