Friday, May 24, 2024

వేములవాడలో వీధి కుక్కల స్వైర విహారం

  • కుక్కల దాడిలో 20 మందికి గాయాలు
  • ప్రజానావ/వేములవాడ: వేములవాడ పట్టణంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. బుధవారం ఒక్కరోజే మూడు వీధుల్లో దాదాపు 20మందిపై దాడిచేసి గాయపరిచాయి. ఇటీవల కుక్కల దాడులు పెరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం దాడులు జరిగినప్పడు మాత్రమే కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకుంటామని చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడుతున్నారు. మున్సిపాల్టీలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img