Friday, May 24, 2024

చెప్పింది వినకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు

– రిపోర్టర్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌
తాను చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని మంత్రి కేటీఆర్‌ ఓ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయితే ఈ ప్రెస్ మీట్ జరగుతున్న తరుణంలో ఓ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ మంత్రి మాట్లాడుతుండగా అడ్డుపడటంతో ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల వాయిస్ అంటూ ఆయన సమాధానం ఇవ్వడంతో ఇలాంటి పనికిమానిలిన మాటలు ఆపాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు. మీడియాకు కూడా కొంత బాధ్యత ఉంది.. మీరు ఫోర్త్ ఎస్టేట్.. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్బా ధ్యతరహితంగా చేయకండి అంటూ కేటీఆర్ తెలిపారు. ఇదిలాఉంటే టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో రాజశేఖర్ రెడ్డి వెనుక ఎవరున్న వదిలే ప్రస్తక్తి లేదని కేసీఆర్ సూచించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డితో పాటు ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా తాము తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత కనీస అవగాహన ప్రభుత్వానికి ఉందన్నారు. అలాగే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మెటీరియల్ ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img