Sunday, May 19, 2024

ఇద్దరు పిల్లలు సహా మహిళ ఆత్మహత్య

దంపతుల మధ్య గొడవే కారణం?
బన్సీలాల్‌పేటలో విషాదం
ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలో విషాదం నింపింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. ముందుగా ఇద్దరు కవల పిల్లలను భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటన స్థలానికి చేరుకొని స్థానికులు, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవని, డబుల్ బెడ్ రూం తన పేరు మీద రాయాలి అని భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇదిలాఉంటే యాదాద్రిలో భార్య పేరు మీద ఉన్న భూమిని కూడా తన పేరు మీద రాయాలని భర్త గణేశ్‌ వేధించినట్లు తెలుస్తోంది. గణేశ్‌కు వివాహ సమయంలోనే రూ.2 లక్షల కట్నం ఇచ్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. యాదాద్రి వద్ద ఉన్న భూమి కూడా గణేశ్‌ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని, ఇప్పుడు తన కూతురు, పిల్లలను ఇలా చూస్తాననుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img